ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుకోవడం మంచిదేనా?

samatha 

31  MAY 2025

Credit: Instagram

ఇల్లు అందంగా కనిపించాలంటే తప్పకుండా చుట్టూ అందమైన మొక్కలు పెంచాలి అంటారు. ఎంత చిన్న ఇల్లు అయినా సరే మొక్కలతో మంచి లుక్ వస్తుంటుంది.

అందుకే చాలా మంది ఇంట్లో మొక్కలను పెంచుతారు. చాలా మంది మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారు.

ఇంటిలోపల స్నేక్ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయంట. అంతే కాకుండా దీనిని పెంచుకోవడం వలన డేంజర్ కూడా ఉన్నదంట.

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెట్టుకోవడం వలన అది గాలిని శుద్ధి చేసి,హనీకరమైన బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా చూస్తుంది. అందుకే స్నేక్ ప్లాంట్ చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు.

అలాగే,పొడవైన ఆకులు, చివరన తెలుపు రంగు గల చారలతో ఉండే ఈ స్నేక్ ప్లాంట్ మొక్క ఆకులు ఇంటికి అందాన్ని తీసుకొస్తాయి.బాల్కనీలో పెట్టుకోవడం వలన చాలా బాగుంటుంది.

స్నేక్ ప్లాంట్ మొక్కలు మట్టిలేకుండా పెరుగుతాయి. ఇవి కేవలం నీటిలోనే పెరుగుతాయి. శుభ్రమైన నీటితో నిండిన అందమైన గాజు గ్లాస్‌లో దీనిని సులభంగా పెంచవచ్చు.

అందుకే చాలా మంది తమ ఇంటికి అందం కోసం, స్వచ్ఛమైన గాలి కోసం ఇంటిలో స్నేక్ ప్లాంట్ మొక్కను పెంచుకుంటూ ఉంటారు.

అయితే ఇంట్లో పెంచుకునే ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది కానీ, దాని ఆకులు చాలా విషపూరితమైనవంట. వీటిని తినడం వలన వాంతులు, అతిసారం, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయంట.