పౌర్ణమిరోజున చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలివే..అస్సలే మిస్స్ అవ్వకూడదంట
samatha
29 MAY 2025
Credit: Instagram
మంచి ప్రదేశాలు.. చూడగానే మనసుకు హాయినిచ్చే ప్లేసెస్‌కు వెళ్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటి ప్రదేశాలను ఎప్పటికీ మర్చి పోలేరు.
అయితే చాలా మంది అడవులు, పర్వతాలు, లోయలు, సరస్సులు, బీచ్‌ల వద్దకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నైట్ టైమ్ చూడాల్సిన ప్రదేశాల గురించి ఎక్కువగా ఆలోచించరు.
కానీ కొన్ని ప్రదేశాలు నైట్ చూస్తే వచ్చే ఫీలింగ్ మాల్దీవ్స్‌లోకి వెళ్లినా రాదంట. మరీ ముఖ్యంగా కొన్ని ప్రదేశాలను పౌర్ణమి రోజు చూస్తే భలే అనిపిస్తుందంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎత్తైన ప్రదేశంలో ఉండే త్సో మోరిరి సరస్సు లడఖ్‌లో ఉంది. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. అయితే పౌర్ణమి రోజున ఈ సరస్సులో ప్రవహించే నీరు చాలా మెరిసిపోతూ కనిపిస్తుందంట.
పౌర్ణమి రోజు చూడాల్సిన ప్రదేశాల్లో ఉదయ్ పూర్ ఒకటి. ఇది రాజస్థాన్‌లో ఉంది. ఇక్కడి భవనాలు చంద్రకాంతిని ప్రతి బింబిస్తాయంట. చూస్తే చాలా ఆనందం కలుగుతుందంట.
నీర్మహల్, ఇది త్రిపురలో ఉంది. రుద్ర సాగర్ సరస్సు పై నిర్మించిన ఈ అద్భుతమైన, అందమైన రాజభవనం పౌర్ణి రోజున మెరిసిపోతూ అందంగా కనిపిస్తుందంట. చాలా బాగుంటుందంట.
గుజరాత్‌లోని కచ్ ఎడారి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది పర్యాటకు వెళ్తుంటారు. అయితే ఈ ఎడారి పౌర్ణమి రోజు అద్దంలా మెరిసిపోతూ అందంగా కనిపిస్తుందంట.
ఇక పౌర్ణమి రోజు చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో తాజ్ మహల్ ఒకటి. ఇది మొత్తం తెల్లటి పాలరాయితో నిర్మించబడినది. అయితే దీనిని పౌర్ణమి రోజు చూస్తే చాలా అందంగా కనిపిస్తుందంట.