వర్షాకాలంలో మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

samatha 

10  JUN  2025

Credit: Instagram

మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది వేసవి కాలంలో వీటిని చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారు.

అయితే వర్షాలు పడటం మొదలైన తర్వాత కొందరు అస్సలే మామిడి పండ్లు తినకూడదు అని చెప్తారు. కాగా, అసలు వర్షాకాలంలో మామిడి పండ్లు తినడం మంచిదా కాదా? తెలుసుకుందాం.

వర్షాకాలంలో మామిడి పండ్లు తినడం వలన ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయంట. అంతే కాకుండా శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతాయంట.

అంతే కాకుండా వర్షాకాలంలో మామిడి పండ్లు తినడం వలన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ వీటిని ఈ సీజన్‌లో తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి 

వర్షకాలంలో మామిడి పండ్లను కడిగిన తర్వాతే తినాలంట.ఎందుకంటే వాటిపై పురుగుల మందులు లేదా తేమతో కూడిన రుతుపవనాల వలన వాటిపై బ్యాక్టీరియా చేరుతుందంట.

ఈ సీజన్‌లో ఎక్కువ మామిడి పండ్లు తినడం వలన ఇవి మీ రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా ఉబ్బరం, లేదా శరీరానికి వేడిని కలిగించడం, జీర్ణ సమస్యలకు కారణం అవుతుందంట.

వర్షకాలంలో కొంత మందికి మామిడి పండ్లు తినడం వలన అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వారు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే మంచిది.

తేమతో కూడిన వాతావరణంలో మామిడి పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి. కాబట్టి తినే క్రమంలో చూసి తినాలంట. అది కుల్లిపోయి లేదా, పురుగులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుందంట.

కొందరు మామిడి రసం తీసి పాలు లేదా పెరుగుతో కలిపి తింటారు. కానీ ఇలా అస్సలే తినకూడదంట. దీని వలన గ్యాస్ లేదా ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయంట.