ఎండాకాలంలో బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?
samatha
19 April 2025
Credit: Instagram
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా బెల్లంతింటుంటారు. కానీ దీనిని వేసవి కాలంలో మాత్రం తినకూడదంటున్నారు నిపుణులు.
అసలు బెల్లాన్ని ఎండాకాలంలో ఎందుకు తినకూడదు, సమ్మర్ లో బెల్లం తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు కనీసం రోజులో ఒక్కసారైనా కొంచెం బెల్లం తినాలని చెబుతుంటారు. ఎందుకంటే దీనిలో అనే పోషకాలు ఉంటాయి.
బెల్లంలో ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఏ, బి వంటి అనేక పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా దీనిని ప్రతి రోజూ తినడం వలన రక్త హీనత సమస్య రాదు అంటారు.
అంతే కాకుండా బెల్లంలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.
కానీ బెల్లాన్ని వేసవిలో తినడం వలన మాత్రం లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయిని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
బెల్లం శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువలన దీనిని ఎండాకాలంలో ప్రతి రోజూ తినడం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు
అంతే కాకుండా సమ్మర్ లో బెల్లం తినడం వలన ఇది అధిక చెమట, నిర్జలీకరణ, అంతే కాకుండా కొందరికి అలెర్జీ, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నదంట.