ఎంత పొదుపు చేసినా డబ్బు ఆదా అవ్వడం లేదా.. మీ కోసమే బెస్ట్ టిప్స్!

samatha 

18 April 2025

Credit: Instagram

డబ్బును ఆదా చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సవాల్ తో కూడిన విషయమే. ఎందుకంటే నిత్యవసర ధరలు, పిల్లల స్కూల్ ఫీజులు చాలా పెరిగిపోయాయి.

నెలకు వచ్చే జీతంతో పోలిస్తే ఖర్చులే అధికంగా ఉంటున్నాయి. దీంతో చాలా మంది డబ్బును ఎంత పొదుపు చేద్దాం అన్నా కుదరడం లేదు. అయితే అలాంటి వారికే ఈ సమాచారం.

మీరు ఎంత డబ్బును ఆదా చేసినా మనీ పొదుపు కావడం లేదా? అయితే దానికి కోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం పదండి మరి

మంచి ప్రణాళికా సిద్ధం చేసుకోవాలి. నెల వారీ ఖర్చులు, మీ సంపాదన మొత్తం లెక్క వేసుకొని, దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వలన డబ్బు ఆదా అవుతుంది.

మీరు ఖర్చు ఎక్కువ దేనికి పెడుతున్నారు, ఆదాయం, ఖర్చులు, పొదుపుల గురించి మంచి అవగాహన ఉండాలి. దీని వలన మీరు కాస్త డబ్బు పొదుపు చేయొచ్చు.

కొందరు ఉన్నది కదా అని క్రెడిట్ కార్డును అధికంగా వాడుతారు. కానీ ఎప్పుడూ కూడా క్రెడికార్డును అతిగా ఉపయోగించకూడదంట. దీని వలన ఖర్చులు పెరుగుతాయి.

ఎమెర్జెన్సీ ఫండ్ తప్పకుండా ఉండాలి, దీని వలన మీరు అత్యవసర పరిస్థితుల్లో మీకు ఇది చాలా ఉపయోగ పడుతుంది. అందువలన తప్పకుండా ఇది ఉండాల్సిందేనంట.

కొందరు ప్రతి చిన్న పార్టీకి షాపింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మీ దగ్గర పొదుపుకు పోను, ఖర్చు పోను మిగిలిన డబ్బుతోనే షాపింగ్ చేయాలంట లేకపోతే డబ్బు ఆదా చేయలేరు.