వేసవి తాపాన్ని తగ్గించడంలో పుచ్చకాయకు మించిన పండు మరొకటి లేదు. అందుకే చాలామంది వేసవిలో పుచ్చకాయను ఇష్టంగా తింటారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ.
శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ కొంతమంది పుచ్చకాయను తినకూడదు.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయకు దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకుంటున్నవారు లేదా కిడ్నీలు సరిగా పనిచేయని వారు పుచ్చకాయ తినకూడదు.
ఎందుకంటే పుచ్చకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో అధిక పొటాషియం రక్తంలో పేరుకుపోతుంది. దీనివల్ల హైపర్‌కలేమియా అనే పరిస్థితి వస్తుంది.
ఇది గుండె లయను దెబ్బతీస్తుంది , ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తినే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను మితంగా తినాలి లేదా పూర్తిగా మానుకోవాలి. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉంటుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. మధుమేహం నియంత్రణలో లేనివారు పుచ్చకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి సమస్యలు వస్తాయి.
కొంతమందికి పుచ్చకాయ తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ సెన్సిటివిటీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.