దానిమ్మ పండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే..!

Jyothi Gadda

24 June 2025

ఎర్ర‌గా ఉండే దానిమ్మ పండును తిన‌డానికి చాలామంది ఇష్టపడతారు. దీనిని స‌లాడ్‌, జ్యూస్ రూపంలో తీసుకుంటారు. దానిమ్మ పండును తిన‌డంతో క‌లిగే లాభాలు గురించి చూద్దాం.

దానిమ్మ గింజ‌లు తిన‌డంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. ఫైబ‌ర్ శాతం ఎక్కువ‌గా ఉండ‌డంతో కొవ్వులు, ప్రోటీన్లు వెంట‌నే ఎన‌ర్జీగా మారుతాయి. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.

దానిమ్మ పండులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, క్యాలరీలు, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్‌తో పాటు విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

దానిమ్మ పండులో ఉండే తక్కువ క్యాలరీలు మన బరువును నియంత్రిస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. 

దానిమ్మ పండుని తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలను దానిమ్మ పండ్లు దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

దానిమ్మ గింజ‌లు తిన‌డం వల్ల నోటీ ఆరోగ్యానికి మంచిది. దీంతో చిగుళ్లు బ‌లంగా త‌యారై దంతాలు గ‌ట్టిప‌డ‌తాయి. ఈ గింజ‌ల వ‌ల‌న నోటిలోని బ్యాక్టీరియా కూడా త‌గ్గుతుంది.

దానిమ్మలోని ఫైబ‌ర్ కొవ్వును క‌రిగిస్తుంది. రోగ‌నిరోధ‌శ‌క్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి. పలు సమస్యలను నివారిస్తాయి.

దానిమ్మ గింజ‌ల‌లో క్యాన్స‌ర్ నిరోధించే గుణాలు ఉంటాయి. దానిమ్మ ర‌సం తాగ‌డంతో ప్రోస్టేట్ క్యాన్స‌ర్ త‌గ్గుతుంద‌ని చెబుతుంటారు. ఇవి కిడ్నీల్లో రాళ్ల‌ను కూడా కరిగిస్తాయి.

దానిమ్మ పండు మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుచేస్తుంది. ఆల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులు నయమవుతాయి. అంతేకాదు దానిమ్మ పండుతో జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.