కొబ్బరి బోడంలోకి నీళ్లు ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా?

samatha 

19 April 2025

Credit: Instagram

వేసవిలో కొబ్బరి బోడంలోని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో దీనిలోని నీరు తాగడం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

అంతే కాకుండా ప్రతి రోజూ గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు వైద్య నిపుణులు.

ఇక కొబ్బరి కాయను పగల గొట్టగానే మనకు అందులో నీళ్లు, తెలుపు రంగులో కొబ్బరి మలై ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

అసలు కొబ్బరి బోడంలోపలికి నీరు ఎలా వెళ్తాయి. చెట్టు ఎంతో ఎత్తులో పైన ఉంటుంది. అలాంటి చెట్టు కాయల్లోకి చల్లటి, తియ్యటి నీరు ఎలా వస్తుంది?

కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ల గురించి  నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సంస్థ అధ్యనంలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి.

కొబ్బరి నీరు అనేది  ఒక వడ కట్టిన ద్రవం అంట. చెట్టులోప ఉండే వాస్క్యూలర్, అంటే నీటిని రవాణా చేసే వ్యవస్థ ద్వారా కొబ్బరి బోండంలోని నీరు వెళ్తాయంట.

కొబ్బరి చెట్టు వేర్లు దాదాపు  ఒకటి నుంచి దాదాపు 5 మీటర్ల లోతు వరకు భూమిలో పాతుకపోయి ఉంటాయంట. అలా చెట్టు వేళ్లు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భజలాలను గ్రహిస్తాయి.

ఆ నీరు కాండం ద్వారా, చెట్టుపైకి రవాణా అయ్యి, చివరకు కొబ్బరికాయలోకి చేరుతుందంట. ఆ నీటిని కొబ్బరికాయలోని టెంక భాగంనిల్వచేస్తుందంట. కాయ ముదిరే కొద్ది ఆ నీరు గుజ్జుగా మారి కొబ్బరి మలై తయారవుతుంది.