బిర్యానీ తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా?
samatha
10 JUN 2025
Credit: Instagram
చాలా మంది బిర్యానీ లేదా ఎక్కువ మొత్తంలో నాన్ వెజ్, వెజ్‌తో భోజనం చేసిన తర్వాత సోంపు గింజలను నములుతుంటారు. మరి బిర్యానీ తర్వాత తప్పకుండా సోంపు తింటారు.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బిర్యానీ తిన్న తర్వాత సోంపు గింజలు ఎందుకు నమలాలి. దీని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో? ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజలు అనేవి ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎక్కువ మొత్తంలో ఫుడ్ తీసుకున్న తర్వాత సోంపు తిన్న తింటే కడుపు చాలా తేలికగా అనిపిస్తుందంట.
అంతే కాకుండా, జీర్ణక్రియ సక్రమంగా సాగడానికి ఉపయోగపడుతుంది. సోంపు గింజలు జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. దీంతో అజీర్తిని నివారిస్తుందంట.
బిర్యానీ తిన్న తర్వాత సోంపు నమలడం వలన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. అదే విధంగా సోంపు, తీపి వాసనతో శ్వాస తీసుకోవడం లో కూడా ఇబ్బంది లేకుండా సహజంగా వస్తుంటుంది.
బిర్యానీ తిన్న తర్వాత సోంపు నమలడం వలన ఇది ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. కడుపులోని ఆమ్లత్వం, గుండెలో మంట, తిన్న తర్వాత కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి సాంప్రదాయ నివారణలలో సోంపు గింజలు ఉపయోగిస్తారు. అలాగే వీటిని వారు తినడం వలన కొత్త ఉత్సాహాన్ని పొందుతారు.
భోజనం చేసిన తర్వాత సోంపు నమలడం వలన ఇది కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీని వలన కడుపు సంబంధ సమస్యలు తగ్గిపోతాయంట.