అలాగే మాంగనీస్, కాపర్, మెగ్నిషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ కూడా కొబ్బరిపాలలో సమృద్ధిగా లభిస్తాయి.
కొబ్బరిపాలలో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ మన శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
అధ్యయనాల ప్రకారం కొబ్బరిపాలలో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ ఆకలిని నియంత్రిస్తాయి. కొవ్వు కరగడాన్ని ప్రోత్సహిస్తాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరిగేలా చేస్తాయి.
ఈ పాలలో ఉండే లారిక్ యాసిడ్ యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. కొబ్బరిపాలను సేవిస్తుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.