బొబ్బర్లు తింటే బోలెడు ప్రయోజనాలు!

Jyothi Gadda

06 July 2025

బొబ్బర్లలో విట‌మిన్ బి9, విట‌మిన్లు ఎ, కె, బి1, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, పొటాషియం, సెలీనియం కూడా ఈ గింజ‌ల్లో స‌మృద్ధిగా ల‌భిస్తాయి.

బొబ్బ‌ర్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూరం చేస్తుంది.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం తగ్గుతుంది. 

వీటిని ఉడ‌క‌బెట్టి తింటే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది కడుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌దు. త‌క్కువ‌గా తింటారు. ఫలితంగా బరువుతగ్గుతారు. 

బొబ్బ‌ర్ల‌లో ఉండే ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.

బొబ్బ‌ర్ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

షుగ‌ర్ ఉన్న‌వారికి కూడా బొబ్బర్లు మంచి మెడిసిన్‌లా ప‌నిచేస్తుంది.ఈ ప‌ప్పులో ఉండే ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో షుగర్‌ అదుపులో ఉంటుంది.

బొబ్బ‌ర్ల‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గ‌ర్భిణీల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. గ‌ర్భంలో శిశువు ఎదుగుద‌ల‌కు స‌హాయ ప‌డుతుంది. వీటితో ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. 

బొబ్బర్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేయ‌డంతోపాటు అంత‌ర్గ‌తంగా ఉండే వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.