వారేవ్వా.. బ్లాక్ గ్రేప్స్‌ తింటే ఇన్ని లాభాలా..? 

Jyothi Gadda

03 July 2025

నల్ల ద్రాక్ష తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల  మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు.

తియ్యగా ఉండే నల్ల ద్రాక్ష వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్లటి ద్రాక్షలో సీ-విటమిన్‌, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. 

గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. అవి అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. 

గుండెపోటు నివారణకు దోహదపడుతాయి. నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.  

నల్ల ద్రాక్ష మెదడు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. 

నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. 

నల్ల ద్రాక్ష చర్మానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. చర్మాన్ని దృఢంగా, సాగేలా ఉంచుతుంది. నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా తగ్గిస్తుంది. 

ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. ఇందులో ఉండే నైట్రిన్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి.