రోజు ఒక జామకాయను తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
Jyothi Gadda
04 July 2025
జామకాయలు లేదా పండ్లలో క్యాలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా ఉంటాయి. జామకాయల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
జామకాయను కనీసం రోజుకు ఒకటి అయినా తినాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో జామకాయలను తినడం వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
జామకాయలను కచ్చితంగా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో చెప్పలేనన్ని లాభాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. జామకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
ఒక మీడియం సైజ్ జామకాయను తింటే మనకు సుమారుగా 228 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది.
కామన్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం అందిస్తుంది. జామకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ముఖ్యంగా జామకాయలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కాపర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల మన శరీరం హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది.
జామకాయల్లో మెగ్నిషియం కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది కండరాలను ప్రశాంత పరుస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది.
జీర్ణక్రియను మెరుగు పరచడంలో జామకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. మెదడు పనితీరుకు మంచిది.