చాణక్య నీతి : గయ్యాళి భార్య ఇంట్లో ఉంటే.. భర్త ఈ విషయాల్లో జాగ్రత్తపడాల్సిందే!
samatha
Pic credit - Instagram
ఒక వ్యక్తికి కావాల్సింది డబ్బు, ఆస్తులు అంతస్తులు కాదు అంటున్నాడు చాణక్యుడు. ఒక మనిషికి జీవితంలో నిజమైన ఆనందమే డబ్బు కంటే ఎక్కువ.
ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో ఇబ్బందులకు, చికాకులకు లోను అవుతుంటారు. ఏదో ఒక బంధంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
ముఖ్యంగా కొందరు భర్త విషయంలో మానసిక సమస్యలు ఎదుర్కుంటే, కొందరు భార్య గయ్యాళి స్వభావాన్ని భరించలేక ఇబ్బంది పడుతుంటారు.
అయితే ఆ చార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే, అలాగే భార్య గయ్యాళి అయితే భర్త ఈ విషయాల్లో జాగ్రత్తపడాలంట.
గయ్యాళి భార్య అంటే, ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి. ఈ స్వభావం వలన ఇతరులు నిరంతరం ఇబ్బందులకు లోను అవుతూనే ఉంటారు.
ముఖ్యంగా ఇలాంటి వారు భర్తకు చికాకు, మానసిక వేదనను కలిగిస్తుంటారు. అలాగే వీరి వలన ఇంటి గుట్టు కూడా బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇలాంటి భార్య ఉన్న ఇంటిలో భర్త ఎప్పుడూ తన కెరీర్ కు సంబంధించిన విషయాలు లేదా, ఇంటి పురోగతికి సంబంధించినవి ఆమెతో చర్చించకూడదంట.
అలాగే, అలాంటి వ్యక్తులతో సావాహం అంటే పాము ఇంటిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత జాగ్రత్తగా ఉండాలంట. ప్రతి విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలంట.