01 December 2025

మీరు రోజుకు 10 వేల అడుగులు నడవలేకపోతున్నారా?

samatha

Pic credit - Instagram

నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ రోజు కనీసం 10,000ల అడుగులు నడవాలని సూచిస్తుంటారు.

కానీ కొంత మంది మాత్రమే ప్రతి రోజూ పది వేల అడుగులు నడుస్తారు. కానీ మీరు అంతలా నడవలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!

ఫిట్ నెస్ నిపుణుల ప్రకారం, మీరు ప్రతి రోజూ కనీసం 10 వేల అడుగులు నడవాలి అనుకుంటే,10,000ల అడుగులు బెంచ్ మార్క్ పెట్టుకొని నడవకూడదంట.

మీరు ఎన్ని అడుగులు నడవాలి అనేది మీ జీవనశైలి నిర్ణయిస్తుందంట. ఒక వేళ మీరు రోజుకు 9 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొంటే తప్పకుండా 8000 నుంచి 9000 అడుగులు నడవాలి.

ఒక వేళ మీరు పరిగేత్తడం, నడవడం వంటి వర్క్ చేస్తుంటే, మీరు చాలా సులభంగా 15000 అడుగులు నడవగలుగుతారంట.

అందువలన పది వేల అడుగులు రోజూ ఎలా నడవాలి అని ఆలోచించడం కంటే మీరు ప్రతి రోజూ చురుకుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంట.

అదే విధంగా మీరు ప్రతి రోజూ కనీసం 10 నిమిషాల పాటు వాకింగ్ చేయండం వలన గుండె సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట.

ఒక వేళ మీరు రోజూ వాకింగ్ చేయకపోయినప్పటికీ, రోజూ 10 వేల అడుగులు నడవలేకపోయినప్పటికీ, రోజూ ఈ పది నిమిషాల వాకింగ్ ఉపయోగపడుతుందంట.