కివి తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

samatha 

10  JUN  2025

Credit: Instagram

పండ్లలో కివి పండు ప్రత్యేకతే వేరు. కానీ చాలా మంది దీనిపి తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. కానీ కివి తింటే బోలెడు లాభాలు ఉన్నాయంట.

కివి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మందిలో తప్పకుండా కివి తినాలని సూచిస్తారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు వీటిని ఎక్కువగా తినాలంటారు.

ఎందుకంటే? కివిలో విటమిన్స్, మినరల్స్, ఐరన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఇందులో ఎక్కవ మొతాదులో ఉంటుంది.

అందువలన కివిని తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్స నుంచి రక్షణ కల్పిస్తుంది. శరీరానికి తక్షణ శక్తని అందిస్తుంది

కివిలో అధికంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, వృద్ధాప్య ఛాయలు ముడతలను నివారిస్తాయంట. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతాయంట.

కివి తినడం వలన ఇవి బిపిని నియంత్రిస్తాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్త ప్రసరణను మెరుగు పరిచి, రక్తపోటు నియంత్రించడానికి సహాయపడుతుందంట.

ఈ పండులో మెగ్నీషియం, విటమిన్స్ , ఫోలెట్ వంటి అనేక పోషకాలు ఉన్నందున ఈ పండు తినడం వలన ఎములకలు బలంగా తయారు అవుతాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

జుట్టు ఆరోగ్యానికి కివి చాలా మంచిది. ఎందుకంటే? ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు జుట్టురాలడాన్ని తగ్గిస్తాయి.