11 December 2025

స్పైసీ స్పైసీ నాటు కోడి మసాలా కూర.. ఇలా వండితే ముక్క మిగలదు అంతే!

samatha

Pic credit - Instagram

నాటుకోడి కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నాటు కోడి కూర అంటే ప్రతి ఒక్కరూ, లొట్టలేసుకొని మరి తింటారు. కాగా, ఇప్పుడు మనం నాటుకోడి మసాలా కూర ఎలా తినాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు : నాటు కోడి, టమోటాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, నెయ్యి, ఉప్పు, ఎండు మిర్చి, సరిపడ నూనె, పూ దీనా.

తయారీ విధానం : ముందుగా నాటు కోడి కూరను వేడి నీటిలో నిమ్మకాయ నీళ్లు, ఉప్పు వేసి, అందులో చికెన్ వేసి తీసి, క్లీన్ చేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో సరిపడ నూనె, నెయ్యి వేసుకోవాలి. అది వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు,  పుదీనా వేసి వేయించుకోవాలి.

తర్వాత ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వీటన్నింటి వేయించుకొని పేస్టు చేసుకోవాలి. దీనిని టమోటాలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయించుకోవాలి.

తర్వాత ఇందులో చికెన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ముక్కలు మంచిగా వేగేలా చేసుకోవాలి. తర్వాత దీనిని కొన్ని నీళ్లు పోస్తూ ఉడికించుకోవాలి.

తర్వాత ఇంటిలో రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత కర్రీలో కొత్తిమీర వేసుకొని, స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే అందరు మెచ్చే, అందరికీ ఇష్టమైన వేడి వేడి నాటు కోడి మసాలా కర్రీ రెడీ, మరి మీరు కూడా ట్రై చేసి, ఫ్యామిలీతో ఆనందంగా తినేయండి.