02 December 2025

చీయా సీడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారా.. ఈ ముప్పు తప్పదు!

samatha

Pic credit - Instagram

చీయా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.  అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు.

మంచి పోషకాలు, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటీకీ వీటిని అధికగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

చీయా సీడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయంట. అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

జీర్ణ సమస్యలు ఉన్నవారు అస్సలే చీయా సీడ్స్ అస్సలే తీసుకోకూడదంట. దీని వలన కడుపు నొప్పి, మలబద్ధకం , విరేచనాలు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయంట.

అదే విధంగా శ్వాసకోశ వ్యాధులు, గొంతు సమస్యలు ఉన్నవారు కూడా అస్సలే చియా సీడ్స్ తీసుకోకూడదంట. ఇది అనేక సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా అస్సలే చియా సీడ్స్ తినకూడదంట. దీని వలన చర్మ సమస్యలు అధికం అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయంట.

అంతే కాకుండా, దగ్గు, జలుబు , గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే చియా సీడ్స్ ఎక్కువ తీసుకోకూడదంట.