02 December 2025
లవంగాల టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
samatha
Pic credit - Instagram
టీ, కాఫీలు చాలా మంది తాగుతుంటారు. ఇక కొంత మంది గ్రీన్ టీ, తులసి టీ ఇలా రకరకాల టీలు తాగుతుంటారు.
అయితే ఇవే కాకుండా లవంగాల టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ముఖ్యంగా చలికాలంలో లవంగాల టీ తాగడం
వలన చాలా లాభాలు ఉన్నాయంట. అవి ఏవో చూద్దాం.
లవంగాల్లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఫొలేట్, మాంగనీస్ , పొటాషియం , మెగ్నీషియం, ఐరన్ , జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన ఈ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
లవంగాల టీ కనీసం రోజులో ఒక్కసారైనా తాగడం వలన ఇది శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను విడుదల చేసి ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీ
ర్ణం అయ్యేలా చేస్తుందంట.
మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందంట.
అదే విధంగా చలికాలంలో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. అందువలన ఈ సమయంలో రోజూ లవంగాల టీ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయంట.
చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందువలన ఈ సమయంలో లవంగాల టీ తాగడం వలన వీటి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చునంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ టిప్స్ పాటిస్తే.. మీ వంట క్షణంలో పూర్తి అవుతుంది!
కోడి గుడ్డుతో ఇవి అస్సలే తినకూడదు!
చాణక్య నీతి : ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ రోజులు ఉండదో తెలుసా!