01 December 2025

ఎరుపు రంగు చీరలో సమంత.. పెళ్లి కూతురి బ్యూటిఫుల్ ఫొటోస్ ఇవే!

samatha

Pic credit - Instagram

అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది.

ఇక ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది, ఈ మూవీ తర్వాత వరసగా సినిమాలు చేసి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2017 అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని, 2021లో మనస్పర్థల ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు.

తర్వాత సమంత అనారోగ్యం పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.

ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా రాజ్ నిడిమూర్‌ను వివాహం చేసుకొని, అందరికీ షాకిచ్చింది. డిసెంబర్ 1 సోమవారం ఉదయం కోయంబత్తూరులో లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది.

సమంత రెడ్ కలర్ చీరలో , కొప్పున మల్లె పూలతో రెడీ అయ్యి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పెళ్లి కూతురు లుక్‌లో అదిరిపోయింది.

దీంతో ప్రస్తుతం సమంత , రాజ్ నిడిమోర్ వివాహానికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా చూసెయ్యండి.