01 December 2025

సమంత వెడ్డింగ్ రింగ్ అర్థం ఏంటో తెలుసా? దీని  వెనుక అంత మీనింగ్ ఉందా?

samatha

Pic credit - Instagram

ఎట్టకేలకు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కు చెక్  పెడుతూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, రాజ్ నిడిమోర్.

డిసెంబర్ 1,2025లో కొయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో సమంత, రాజ్ నిడిమోర్ అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు

రీసెంట్‌గా సమంత వీరి పెళ్లి ఫొటోలను తన ఇన్ ష్టాలో షేర్ చేయడంతో ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక వీరి వివాహపు ఫొటోల్లో సమంత వెడ్డింగ్ రింగ్ తెగ వైరల్ అవుతుంది.

డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ రింగ్ దీర్ఘ చతురస్త్రాకారంలో , చాలా ప్రత్యేకంగా ఉంది. అయితే ఈ నాలుగు మూలలు నాలుగు అర్థాలు ఉన్నాయంట.

డైమండ్, పచ్చ రత్నాలతో డిజైన్ చేసిన ఈ రింగ్, ప్రేమ, వివాహంలో నిబద్ధత, విశ్వాసం, నిజాయతి, బంధంలో విలువైన ప్రేమను చూపిస్తుందంట.

సమంతో ఈ వివాహ బంధాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటానని, హామి ఇస్తూ.. తన ప్రేమను, ప్రపంచంలోని ప్రేమను , ఆనందాన్ని తనకు ఇస్తున్నాను అంటూ ఈ రింగ్ అర్థం .

మొత్తానికి దర్శకుడు రాజ్ నిడిమోర్ సమతను ప్రేమగా, ఆనందంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తూ డైమండ్ రింగ్ ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచారు.

ఇలా సమంతపై తనకు ఉన్న ప్రేమను , గౌరవాన్ని రాజ్ నిడిమోర్ ఉంగరంతో వెల్లడిస్తూ.. నేడు మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒకటయ్యారు.