ఊరంతా కలిసి బొమ్మలకు ఘనంగా పెళ్లి నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఈ వింత పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం మేరకు ఊరి మంచి కోసం ఈ వింత పెళ్లి నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వివాహ వేడుకలు చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. నిజమైన పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.