చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!

Samatha

20 January 2026

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తినాలి అంటారు.

ఆరోగ్యానికి మేలు

ఇక వాతావరణం మారే సమయంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది, రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఇటువంటి సమయంలో మంచి ఆహారం తీసుకోవాలంటారు.

చలకాలం ముగింపు

ప్రస్తుతం చలికాలం ముగింపుకు వచ్చేసింది. వేసవి కాలం త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సమయంలో తప్పకుండా కొన్ని పండ్లు తినాలంట. అవి ఏవో చూద్దాం.

తినాల్సిన పండ్లు

జామ పండు : జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జామ పండ్లు శీతాకాలంలో మంచి రుచిని ఇస్తాయి, ఇందులో ఉండే విటమిన్ సి  అంటు వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

జామ పండు

స్ట్రాబెర్రీ : చలికాలం ముగింపు సమయంలో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు స్ట్రాబెర్రీలు తినడం చాలా మంచిది.

స్ట్రాబెర్రీ

పియర్, డ్రాగన్ ఫ్రూట్ : జీర్ణక్రియను మెరుగు పరిచి, కడుపు సమస్యలను తగ్గిస్తుంది బేరి పండ్లు, అలాగే డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది

పియర్, డ్రాగన్ ఫ్రూట్

కివి, దానిమ్మ :  కివి పండు తినడం వలన ఇది వాతావరణం మార్పు సమయంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తుంది, దానిమ్మ శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది.

కివి, దానిమ్మ

యాపిల్ : యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువలన వీటిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రిమ మెరుగుపడుతుంది

యాపిల్