మార్చి30న ఉగాదిపండుగ,నేడు ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటారు. ముఖ్యంగా తమ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలననుకుంటారు.
విశ్వవాసు నామ సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత మే 15న గురు గ్రహం వృషభ రాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించబోతుంది.
దీంతో ఈ గురు సంచారంతో సంవత్సరం మొత్తం ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుందంటున్నారు పండితులు. ఆ రాశులు ఏవి అంటే?
వృషభ రాశి : ఈ సంవత్సరంలో గురు గ్రహం రెండోసారి వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వలన ఈ రాశి వారికి అఖండ రాజయోగం, ధనలాభం కలుగుతుందంట.కుటుంబలో ఆనందం నెలకొంటుంది.
కుంభ రాశి : కుంభ రాశి వారికి గురు సంచారంతో అదృష్టం కలిసిరానున్నది. అందువలన వీరు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా,వృత్తిపరంగా కలిసి వస్తుంది.
ధనస్సు రాశి : సప్తమ స్థానంలో గురు సంచారం వలన ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
తుల రాశి : ఈ సంవత్సరంలో గురు భాగ్యస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పులు తీరిపోయి, ధన లాభం కలుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది
సింహ రాశి : గురు గ్రహం 11వ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి అనేక లాభాలు కలుగుతాయి. అష్టమ శని నడుస్తున్నా వీరికి ఆర్థికంగా, వృత్తిపరంగా కలిసి వస్తుందంట.