ఇది తెలుసా? కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే దీపమే, ఆ సమస్యలకు పరిష్కారం!

Samatha

5 November 2025

కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ దీపం వెలిగిస్తారు. అయితే చాలా మందికి ఈ దీపం వెలిగించడం వెనుకున్న నిజం తెలియదు. కానీ ఇలా వెలిగించడం మీ జీవితంలోని చాలా సమస్యలకు పరిష్కారం.

నవంబర్ 5న కార్తీక పౌర్ణమి. ఈ రోజు ప్రతి ఒక్కరూ, శివకేశవులను పూజించి, దీపం వెలిగిస్తూ, కుటుంబం మొత్తం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.

అయితే ఈ కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగిపోతాయి. అంతే కాకుండా చాలా పుణ్యం లభిస్తుందంట.

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున గంగా స్నానం, నదిలో స్నానం చేయడం శుభప్రదం.

నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి చన్నీటితో  స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి, పూజలు నిర్వహించాలంట

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి.

కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే, సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుందంట.

అందుకే కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా దేవాలయాలకు వెళ్లి, పూజలు చేసి, తప్పకుండా దీపం వెలిగించాలని చెబుతుంటారు పండితులు.