కార్తీక మాసంలో కాకరకాయ దీపం.. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Samatha

3 November 2025

అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ చాలా నిష్టగా, శివకేశవులను ఆరాధిస్తుంటారు. రోజూ పూజ చేస్తూ వారిని కొలుచుకుంటారు.

 కార్తీక మాసం వస్తే చాలు ప్రతి ఒక్కరూ, దీపారాధన చేస్తుంటారు. అంతే కాకుండా, ప్రతి రోజూ ఉదయం , సాయంత్రం శివకేశవులకు ప్రత్యేక పూజలు చేస్తారు.

 కార్తీక మాసం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉసిరి దీపం. ఈ రోజు ప్రతి ఒక్కరూ శైవ క్షేత్రాలకు వెళ్లి శివకేశవులను పూజించి, ఉసిరి దీపం వెళిగిస్తారు.

కానీ కాకరకాయ దీపం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అవునండీ, కార్తీక మాసంలో కాకరకాయ దీపం కూడా వెలిగిస్తారంట. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.

శత్రు బాధలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధతో బాధపడుతున్నవారు, కార్తీక మాసంలో లేదా అష్టమి సమయంలో కాకరకాయ దీపం వెలిగించడం చాలా శుభప్రదం.

ఈ కాకరకాయ దీపాన్ని ఎలా వెలిగిస్తారంట, రెండు విస్తారకులను తీసుకొని, అందులో కేజీ బియ్యం, పసుపు, కుంకుమ, సామ్రాని కడ్డీలు, పూలు, అరటి పండ్లతో అందంగా అలంకరిస్తారు.

తర్వాత రెండు మోదుగు ఆకులను నేలపై పరిచి, దానిపై బియ్యం పోసి, దాని మీద కాకరకాయను పెట్టాలి, దానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి అందంగా అలంకరించుకోవాలి.

తర్వాత మీ కోరికను చెప్పుకొని, దీపం వెలిగించాలంట. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం, ఈ దీపం ఎక్కువగా చిత్తూరు  జిల్లాలో అష్టకాల భైరవ సమేత ఆలయంలో వెలిగిస్తారు.