నేడే కార్తీక పౌర్ణమి.. సాయంత్రంలోపు ఈ ఒక్క దీపం పెడితే అదృష్టం మీదే!

Samatha

5 November 2025

కార్తీక మాసం వచ్చేసింది, నవంబర్ 5 బుధ వారం రోజున ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు అన్ని రోజుల్లోకెళ్లా చాలా ప్రత్యేకమైనది.

కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. వైష్ణవ, శైవ భేదాలు లేకుండా శివుడిని విష్ణువుగా, విష్ణువును శివుడిగా భావించి పూజించడం ఈ మాసం ప్రత్యేకత.

ఇక అత్యంత ప్రవితమైన మాసాల్లో ఇది ఒక్కటి. ఈ రోజు ఉదయం ప్రతి ఒక్కరూ, సూర్యోదయం లోపల తలంటు స్నానం చేసి శివారాధన చేయాలి. 

శివుని చిత్రపటానికి మల్లెపూలు లేదా గన్నేరు పూల మాల వేసి, దీపారాధన చేసి, శివ సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

సూర్యోదయం అవుతుండగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. రెండు అరటిపండ్లు, పాలు లేదా దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజంతా శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి.

ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రదోష కాలం సాయంత్రం ఎవరైతే శివాలయంలో నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి,  శివలింగం దగ్గర దీపం పెట్టి, శివాయ నమ: అంటూ 27 ప్రదక్షిణలు చేస్తారో వారికి కలిసి వస్తుందంట.

ముఖ్యంగా, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, జిల్లేడు పుష్పాలతో శివుడిని పూజించడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన ఇంట్లోని సమస్యలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారంట.

అలాగే వివాహం కాని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, గ్రహ దోషాలతో బాధపడుతున్నవారు కూడా ఈ రోజున శివ కేశవులకు ప్రత్యేక పూజ చేయడం, చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.