నేడే హనుమాన్ జయంతి..ఇలా చేస్తే శత్రుపీడలు ఉండవంట!

samatha 

22 MAY 2025

Credit: Instagram

ఆంజనేయ స్వామి సప్త చిరంజీవులలో ఒకరు. నేడే హనుమాన్ జంయతి. ఈ పండుగను హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు.

అయితే ప్రతి సంవత్సరం రెండు హనుమాన్ జయంతులు జరుపుకుంటాం. అందులో ఒకటి చైత్రమాసంలో వచ్చేది,మరొకటి వైశాఖ మాసం దశమిన వస్తుంది.

అయితే ఈ సారి వైశాఖ మాసంలో దశమి అంటే మే 22 పూర్వ భాద్ర తిథి రోజున హనుమాన్ జన్మించాడని అందరూ భావిస్తారు. అందుకే ఈ రోజు హనుమాన్ జయంతి జరుపుతారు.

అయితే ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయస్వామి వారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయంట.

హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడికి సింధూరం , తమలపాకులతో పూజిస్తే చాలా శుభప్రదంట.శత్రుపీడల నుంచి విముక్తికలుగుతుందంట.

అంతే కాకుండా ఆంజనేయస్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభంపైన జెండాను ఎక్కిస్తే మనం చేసిన పాపాలు తొలిగిపోతాయి అంటుంటారు పండితులు.

అలాగే ఈ రోజున సుందర కాండ, రామ్ చరిత్ మానస్, శ్రీరామయణం, హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు చదివడం వలన ఆ శ్రీరాముల వారి దీవెనెలు ఉంటాయంట.

అందుకే హనుమాన్ జయంతిన తప్పకుండా దగ్గరిలోని హనుమాన్ టెంపుల్‌కు వెళ్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలంట.