ఆరోగ్య మేటి.. ఖర్జూర తినడం వలన ఎన్ని ప్రయోజనాలో!

samatha 

21 MAY 2025

Credit: Instagram

ఖర్జూర పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా వీటిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా ప్రతి రోజూ రెండు ఖర్జూర పండ్లను తినడం వలన బోలేడు లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్జురా పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్, పొటాషియం,  మెగ్నీషియం, విటమిన్ బీ6, ఇనుము వంటివి అధికంగా ఉంటాయి.

అంతే కాకుండా ప్రతి రోజూ ఖర్జూర పండ్లు తీసుకోవడం వలన గుండె ఆరోగ్య మెరుగు పడుతుందంట. అంతే కాకుండా ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.

అలాగే ప్రతి రోజూ ఖర్జూర పండ్లను తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా సాగుతుందంట. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది అంటున్నారు వైద్యులు.

ఎముకల ఆరోగ్యానికి ఖర్జూర చాలా మంచిది. ఖర్జూరాలలో మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

అదే విధంగా ఖర్జూరలను ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇవి మెదడు పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్యులు.

అదే విధంగా ఖర్జూరలను ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇవి మెదడు పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్యులు.