ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు శవం ఎదురు రావడం మంచిదేనా?

samatha 

8 MAY 2025

Credit: Instagram

ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటాం. కొన్ని సార్లు ఏదైనా శుభకార్య కోసం బయకు వెళ్లగం జరుగుతుంది. ఆ సమయంలో కొంత మందికి శవం ఎదురు రావడం జరుగుతుంది.

అయితే అసలు ఏదైనా పని మీద బయటకు వెళ్లిన ప్పుడు శవం ఎదురు రావడం మంచిదా? దీని వలన ఏదైనా చెడు జరుగుతుందా అనే భావన చాలా మందిలో ఉంటుంది.

కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.అసలు  పని మీద బయటకు వెళ్లినప్పుడు శవం ఎదురు రావడం, శవయాత్ర ఎదురు రావడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయంట.

హిందూ సంప్రదాయం ప్రకారం, మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు చాలా మంది శుభ సమయం చూసి వెళ్తుంటారు.

రాహుకాలం ఉండే ఆ పనిని వాయిదా వేసుకొని, మంచి ముహుర్తం చూసుకొని వెళ్తుంటారు. అయితే కొన్నిసార్లు బయటకు వెళ్లినప్పుడు శవం ఎదురు అవుతూ ఉంటుంది.

శకున శాస్త్రం ప్రకారం బయటకు వెళ్లినప్పుడు శవం ఎదరు రావడం శుభం అంట. రోడ్డు మీద శవ యాత్ర చూడటం లేదా? శవం ఎదురు రావడం అనేది చాలా మంచిదంట.

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు శవ యాత్ర చూడటం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

అలాగే శవయాత్ర చూసినప్పుడు చెడు ఆలోచనలు రానివ్వకుండా శవానికి నమస్కరించి వెళ్లాలంట. దీని వలన ఆగిపోయిన పనులు కూడా పూర్తి అయిపోతాయంటున్నారు నిపుణులు