వేసవిలో చల్లచల్లగా.. మీకు ఆరోగ్యాన్నిచ్చే బెస్ట్ 8 ఐస్ క్రీమ్స్ ఇవే!

samatha 

4 MAY 2025

Credit: Instagram

ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మందికి ఐస్ క్రీమ్ ఇష్టం.

అయితే కొంత మంది ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉన్నా కూడా బయట కొనే వాటిలో తీపి ఎక్కువగా ఉండటం వలన తినడానికి ఇష్టపడరు.

అయితే మీరు ఇంట్లోనే రెడీ చేసుకొని వేసవిలో చల్ల చల్లగా తినాలనుకుంటే, ఈ బెస్ట్ ఎనిమిది ఐస్ క్రీమ్స్ తినొచ్చునంట. అవి :

సహజంగానే తీపి, పాలు లేకుండా ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటే వారి కోసం అరటి పండు ఐస్ క్రీమ్ చాలా బెస్ట్ అంట. ఇందులో ఆరోగ్య కరమైన పోషకాలు ఉన్నాయి.

తాజా పండ్లు, తేనెతో కలిపి చేసుకొనే గ్రీక్ పెరుగు కూడా బెస్ట్ ఆప్షన్. అలాగే కొబ్బరి పాల ఐస్ క్రీమ్ ఆరోగ్యానికి చాలా మంచిది.తక్కువ చెక్కెర,కొబ్బరి పాలు, వెనిలా ఎస్సెన్స్‌తో ఈజీగా చేసుకోవచ్చు.

పండ్లతో కూడిన ఐస్ క్రీమ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివంట. మామిడి, బెర్రీస్, పుచ్చకాయ, అరటి పండు వంటి వాటితో ఐస్ క్రీమ్ చేసుకొని తినొచ్చు.

ప్రొటీన్ పౌడర్, గ్రీకు పెరుగు, బాదం పాలు, వెనిలా కస్టర్డ్ పౌడర్ వంటి వాటితో తయారు చేసుకొనే ప్రోటీన్ ఐస్ క్రీమ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట.

అలాగే కొబ్బరి పాలు, అవకాడో, నిమ్మకాయ, పుదీనాతో కలిపి చేసుకునే అవకాడో ఐస్ క్రీమ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్య కరమైన కొవ్వులుంటాయి.