రుచికరంగా వంటలు ఉండాలి అంటే అందులోకి వాడే నూనె కూడా బాగుండాలి. ఇక మనం వాడే నూనె బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి.
అయితే ఈ తొమ్మిది (9) రకాల వంట నూనెలు ప్రాణాంతకమైనవి అంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సోయా బీన్ నూనె. ఇందులో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయంట. అందువలన ఇవి శరీరంలో మంటను పెంచుతాయి. థైరాయిడ్ కు కారణం అవుతుందంట.
పొద్దు తిరుగుడు నూనె చాలా మంది ఎక్కువగా వాడుతుంటారు. అయితే దీనిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వలన ఇది ఆక్సీకరణం చెంది విషపదార్థంగా మారుతుందంటున్నా నిపుణులు. అందుకే దీని విషయంలో జాగ్రత్త అవసరం.
కనోలా నూనె, మొక్కజొన్న నూనె ఈ రెండు కూడా ఎక్కువ ప్రాసెస్ చేసిన నూనెలంట. వీటిలో ఎక్కువ ఓమెగా ఉంటుంది. అందువలన ఈ రెండు రకాల ఆయిల్స్ గుండె ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు వైద్యలు.
కూరగాయల నూనెలు, ఫామాయిల్ నూనె ఆరోగ్యానికి అస్సలే మంచివి కావంట. వీటిలో సంతృప్తకొవ్వులు పుష్కలంగా ఉండటం వలన ఇవి గుండె, లివర్ ఆరోగ్యానికి చాలా హానికరం అంట. వీటి జోలికి అస్సలే వెళ్లకూడదంట.
వనస్పతి నూనె. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అయితే కొందరు ఈ నూనెను కూడా కూరల్లోకి వాడుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, దీనిలో ట్రాన్స్ కొవ్వు ఎక్కువ మోతాదులో ఉంటుందంట.
ద్రాక్ష విత్తన నూనె, కుంకుమ నూనె ఈ రెండు మార్కెట్లో చాలా వరకు దొరుకుతాయి. ఇందులో ఓమెగా 6 పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటి తీసుకోవడం వలన ఇది గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంట.