ఎండు చేపలు VS పచ్చి చేపలు.. ఏవి ఆరోగ్యానికి మంచిదంటే?

samatha 

2 MAY 2025

Credit: Instagram

చేపలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. చాలా మందికి ఇష్టం. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చేపలను తింటుంటారు.

అయితే ఈ చేపల్లో ఎండు చేపలు, పచ్చి చేపలు రెండు రకాలు ఉంటాయి. కొదరికి పచ్చి చేపలు ఇష్టం మరికొందరికి ఎండు చేపలు ఇష్టం.

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏ రకం చేపలు ఆరోగ్యానికి మంచిది? ఏవి తినడం వలన ఆరోగ్యం బాగుంటుందో..

రెండు రకాల చేపల్లో దాదాపు ఒకే తరహా పోషకాలు ఉంటాయంట. కాకపోతే పచ్చి చేపల్లో 18 నుంచి 20 శాతం ప్రొటీన్ ఉంటే ఎండు చేపల్లో 60 శాతం ఉంటుందంట.

ఒక కేజీ పచ్చి చేపలు తింటే 200ల వరకు ప్రొటీన్ లభిస్తుందంట. అదే కేజీ ఎండు చేపలు తింటే 600 గ్రామల ప్రొటీన్ లభిస్తుందంట.

పోషకాల పరంగా చూసుకుంటే పచ్చి చేపల కంటే, ఎండు చేపలే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చేపల్లో ఈ రెండు రకాల చేపలు ఆరోగ్యానికి మంచిచేస్తాయంటున్నారు వైద్యులు.

కొంత మంది ఎడు చేపలు ఎక్కువగా స్మెల్ వస్తాయని వాటిని ఇంట్లో నిలువ చేసుకోవడం తినడానికి ఎక్కువ ఇష్టం చూపరు. కానీ వీటిని తినడం చాలా మంచిదంట.

ఇక పచ్చి చేపల్లో సాల్మన్, సార్డిన్స్, మాకెరెల్, ట్రౌట్ , హెర్రింగ్, ట్యూనా చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.