లంచ్ చేసిన వెంటనే టీ తాగుతున్నారా?

samatha 

1 MAY 2025

Credit: Instagram

టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఉదయం అయ్యిందంటే చాలు తప్పకుండా టీ తాగాలని అంటుంటారు.

ఇక ఒకరు ఒకరోజు లో ఒకసారి టీ తాగితే, కొంత మంది మాత్రం రోజులో రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు.

అయితే కొందరు ఉదయం పరగడుపునే టీ తాగితే మరికొంత మంది మాత్రం తిన్న తర్వాత టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఇక ఆఫీసులో వర్క్ చేసేవారు రోజులో కనీసం రెండు లేదా మూడు సార్లు టీ తాగుతారు. ముఖ్యంగా మధ్యా్హ్నం లంచ్ తర్వాత టీ తాగడం కామన్.

ఎందుకంటే? కొంత  మందికి తిన్నతర్వాత కునుకు తీయాలనిపిస్తుంది. అలాంటి టైమ్‌లో టీ తాగుతారు. ఇక టీ తాగితే చాలా చురుకుగా అనిపిస్తుంటుంది.

అలాగే నీరసంగా ఉన్నప్పుడు, అలసటను తగ్గించడానికి  టీ ఉపయోగపడుతుందని నమ్ముతారు.అయితే భోజనం చేసిన తర్వాత టీ తాగడం వలన ఆరోగ్యం పై ప్రభావం ఎక్కువగా ఉంటుందంట.

ఎప్పుడైతే భోజనం చేసిన వెంటనే టీ తాగుతారో, జీర్ణవ్యవస్థ పై ప్రభావం ఉంటుంది. దీంతో పోషక పదార్థాలు పూర్తిగా శరీరం తీసుకోదు. దీంతో కడుపునొప్పి సమస్యలు వస్తాయి.

అంతేకాకుండా మధ్యాహ్నం టీ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత టీ తాగుతారో, కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది.