10వ సినిమాలో యాక్సిడెంట్‌.. 20వ సినిమాకు జాతీయ అవార్డు : అల్లు అర్జున్

samatha 

1 MAY 2025

Credit: Instagram

ముంబైలో వేవ్స్ సమిట్‌ను భారత ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి గ్లోబల్ మీడియా, సినీ సెలబ్రిటీలు హాజరవుతున్నారు.

వారికి సంబంధించిన చాలా విషయాలను తమ అభిమానులకు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సమిట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.

తాజాగా వేవ్స్ సదస్సులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. టీవీ9 నెట్ వర్క్ ఎండీ బరుణ్ దాస్‌తో ఐకాన్న స్టార్ చిట్ చాట్ చేశారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మొదట ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మానసిక ప్రశాంతతే నా ఫిట్‌నెస్‌కు కారణం ఆయన పేర్కొన్నారు.

పుష్ప సినిమాతో నాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. సిక్స్‌ ప్యాక్‌ కోసం చాలా కష్టపడ్డా,ప్రతి నటుడికి ఫిట్‌నెస్‌ చాలా కీలకమన్నారు.

నాకు చిన్నప్పటి నుంచే డాన్స్‌ అంటే ఇష్టం. దేశవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు.ప్రతి సినిమా నాకు ముఖ్యమే,విలక్షణ నటన కోరుకుంటాని తెలిపారు.

అభిమానులను దృష్టిలో పెట్టుకునే పాత్రలను ఎంపిక చేసుకుంటాను. సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినప్పుడు భయపడ్డా కాని సవాళ్లు అధిగమించా.. మళ్లీ సినిమాలు చేశాను.

నా 10వ సినిమాలో యాక్సిడెంట్‌ జరిగింది. 20వ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది.అభిమానుల ఆదరణే నన్ను ఈ స్థాయికి చేర్చింది.సినిమా తప్ప వేరే ఆలోచన లేదు షూటింగ్‌ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు