మటన్ ఎక్కువ తింటే గుండె పోటు వస్తుందా?

samatha 

2 MAY 2025

Credit: Instagram

నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే దాంట్లో మటన్ ముందుంటుంది. చాలా మంది మటన్ తినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు.

అంతే కాకుండా ఏ చిన్న పండుగ, పార్టీలు జరిగినా సరే తప్పకుండా మటన్ ఉండాల్సిందే. ఇది లేకుండా ఏ పార్టీలు జరపడం లేదు.

ఇక కొంత మంది వారానికి ఒకసారి మటన్ తింటే, మరికొంత మంది వారానికి రెండు, ఇంకొందరు రెండు రోజులకు ఒకసారి.

ఇలా మటన్ తింటుంటారు. కొందరికి అయితే అసలు మాంసం లేనిదే ముద్ద దిగదు. అయితే మరి ఇలా రోజు మటన్ తినడం మంచిదేనా?

అసలు ఎక్కువగా మటన్ తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.. అయితే మటన్ అతిగా తినడం వలన గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉన్నదంట.

మటన్ లో ప్రాసెస్ చేసిన ఎర్రమాంసం అస్సలే తినకూడదంట. దీనిలో సంతృప్త కొవ్వు , కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలను  ఏర్పరుస్తుందంట.

అంతే కాకుండా అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి కలిగిస్తాయి. దీంతో  కాలక్రమంలో, ఇది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన గుండెపోటు వస్తుంది.

అలాగే ప్రాసెస్ చేసిన మటన్‌ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో ఇది ఊబకాయానికి దారి తీసి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదంట.