కూరగాయల్లో కాకరకాయ ఒకటి. చాలా మంది కాకరకాయ తినడానికి అస్సలే ఇష్టపడరు. వామ్మో.. చేదుగా ఉంది అంటూ పక్కన పెట్టేస్తారు.
కానీ మనం తినకుండా పక్కన పెట్టే ఈ కాకరకాయతో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, కాకరకాయ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
కాకరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని కనీసం వారానికి ఒకసారైనా తినడం వలన ఇది శరీరానికి చాలా మంచి చేస్తుందంటున్నారు నిపుణులు.
దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, జింక్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉండటం వలన కాకరకాయను తింటే అది రోగనిరోధక శక్తిని పెంచుతుందంట. అంతే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది.
కాకరకాయను మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందంట. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రయోజకరం.
ఇక ఎండాకాలంలో కాకరకాయను తినడం వలన ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుందంట. అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
కాకరకాయ చలువ చేసే కూరగాయ. దీనిని తినడం వలన ఇది వేసవి వేడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కాకరకాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అవుతాయి.
కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి.