నిద్రపోయినా.. పదే పదే నిద్రొస్తుందా.. కారణాలు ఇవే !
samatha
4 MAY 2025
Credit: Instagram
కంటినిండా నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక వ్యక్తి కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోవాలి అంటారు ఆరోగ్య నిపుణులు.
కానీ ఈ రోజుల్లో చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. వర్క్ బిజీ, ముఖ్యంగా స్మార్ట్ వలన ఎక్కువ మంది లేట్ నైట్ నిద్రపోతున్నారు.
కొంత మంది రోజుకు తొమ్మిది, పది గంటలు నిద్రపోయినాక కూడా వారికి మళ్లీ మళ్లీ నిద్ర వస్తుంటుంది. అయితే సరిగ్గా నిద్రపోవడమే కాదు, ఎక్కువగా నిద్ర పోవడం కూడా ఓ సమస్యే అంటున్నారు వైద్యులు.
అతిగా నిద్రపోవడం కూడా ఓ ఆరోగ్య సమస్యనేనంట. ఒత్తిడి లేదా ఎక్కువ స్ట్రెస్ కు గురి అవుతున్న వారు. మానసికంగా అలసిపోవడం వలన ఎక్కువగా నిద్రపోతారంట.
అలాగే సరైన ఆహారం తీసుకొని వారు. ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకోని వారిలో శక్తి స్థాయిలు పడిపోయి, వారికి ఎక్కువగా నిద్ర వస్తుందంట.
అదే విధంగా శారీరక శ్రమ లేకపోవడం, అతిగా వ్యాయామం చేయడం వలన చాలా మంది నిద్రకు బానిస అవుతుంటారంట. వారిలో నిద్ర ఎక్కువ ఉంటుంది.
శరీరానికి నీరు చాలా అవసరం. అయితే తగినంత నీరు తాగక పోవడం వలన శరీరం డీ హైడ్రేషన్‌కు గురి అయి అలసట వలన ఎక్కువగా నిద్రపోతుంటారంట.
అలాగే థైరాయిడ్ సమస్యలున్నవారు, రక్త హీనతతో బాధ పడుతున్నవారు ఎక్కు నిద్రపోతుంటారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.