కరీంనగర్‌లో ఉన్న ఈ అందమైన కోట గురించి తెలుసా!బెస్ట్ ప్లేస్

samatha 

21 MAY 2025

Credit: Instagram

సీజన్ ఏదైనా సరే ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్‌లో కరీంనగర్‌లో ఉన్న ఎలగందుల కోట ఒకటి. ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కడికైనా టూర్‌కి వెళ్దాం అనుకుంటారు. అయితే కరీంనగర్‌లో కూడా బెస్ట్ ప్లేస్ ఉంది.

ఇంతకీ అది ఏంటీ అంటే? కరీంనగర్ జిల్లాకు 10 కిలో మీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో  ఉంది.పచ్చని చెట్ల మధ్య అద్భుతమైన కోట ఉంది.

 సుందరమైన ప్రకృతిక నేపథ్యంలో ఉన్న ఈ కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశము, మొఘల్ సామ్రాజ్యం,హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది.

ఈ కోట విదేశీయుల కోటను పోలి ఉంటుంది. అంతే కాకుండా పురాత జ్ఞాపక చిహ్నాలు, కొండ శిఖరాలు అన్ని పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో, చలి కాలంలో ఎలగందుల కోట చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అవి ఎంతో అందంగా ఉంటాయి.

ఎందుకంటే కొండపై పచ్చని వాతావరణంతో చూడముచ్చటగా కనిపిస్తుంది. అందమైన మెట్ల బావులు, రహస్య గడులు, దోరిమినార్ ఇలా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

అలాగే  అక్కడ కొండపై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించిన గుడి. ఇవన్నీ పర్యాటకులను ఎంతగానో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.