చాణక్య నీతి : నిటారుగా ఉన్న చెట్లనే ఎందుకు నరుకుతారో తెలుసా?
Samatha
22 march 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసింది.
చాణక్యుడు
చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి, తన అనుభవాల ద్వారా నేర్చుకున్న విషయాలను అందులో పొందు పరిచారు. ఇవి ఈ తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
చాణక్య నీతి
ఇక చాణక్యుడు ఒక వ్యక్తి ఎప్పుడూ అతిగా సూటిగా ఉండకూడదు. ఇలా ఉండే వ్యక్తులను ఎవరు విశ్వసించరు, ప్రమాదకరం అని తెలియజేశాడు. ముఖ్యంగా సూటిగా ఉన్న చెట్లను నరుకుతారంటూ తెలియజేయడం జరిగింది.
అమయాకత్వం , సూటితనం
అడవికి వెళితే, కట్టెలు కొట్టేవారు మొదట పూర్తిగా నిటారుగా ఉన్న చెట్లనే ఎంచుకుంటారు. వంకర చెట్లను నరకడానికి ఎక్కువ శ్రమ పడుతుంది, అందుకే వాటిని పక్కన పెట్టేస్తారు.
చెట్లను నరకడం
అదేవిధంగా, సమాజంలో కూడా, అతిగా నిష్కపటంగా, అమాయకంగా ఉండేవారే మొదటగా ఇతరుల చేతిలో మోసపోతారు. చాణక్యుని ప్రకారం, అతిగా నిజాయితీగా, సూటిగా ఉండటం ఆత్మ నాశనానికి దారితీస్తుంది.
సమాజం
ప్రజలు సూటిగా మాట్లాడే వారిని బలహీనులుగా భావించడం మొదలుపెట్టి, తమ పనులు చేయించుకోవడానికి వారిని వాడుకుంటారు.
బలహీనులు
మితిమీరిన అమాయకత్వం వల్ల, ఒక వ్యక్తి ఎదుటివారి కుయుక్తిని గ్రహించలేక పదే పదే మోసపోతుంటాడు. అందుకే ప్రతి వ్యక్తి చాలా నిరాడంబరంగా ఉండాలి
అమాయకత్వం
ముఖ్యంగా ఏ సమయంలో ఎలా మాట్లాడాలి? ఎప్పుడు అవును అని చెప్పాలి? ఎప్పుడూ నో అని చెప్పాలి అనే విషయంపై సరైన అవగాహన కలిగి ఉండాలంట.