చాణక్య నీతి : ఉదయం లేవగానే ఈ వస్తువులు చూడటం అశుభకరం
Samatha
30 November 2025
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు ఈయన ఎన్నో విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక విషయాలను తెలియజేశారు.
బంధం , బంధుత్వాలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ , పురుషులు, విజయం, ఓటమి, ఇలా ఎన్నింటి గురించో తెలియజేసిన ఈయన ఉదయం లేవగానే కొన్ని వస్తువులు చూడకూడదని తెలిపాడు.
ఉదయం లేచిన వెంటనే కోపంగా ఉండే వ్యక్తిని చూడకూడదంట దీని వలన మీ రోజు మొత్తం చాలా చిరాకుగా, ప్రశాంతత లేకుండా గడిచి పోతుంది.
అదే విధంగా ఉదయం లేచిన వెంటనే గొడవ పడేవారిని లేదా వాదించుకునే వారిని లేదా పోరాటం చేసేవారిని చూడకూడదంట. ఇది మీ మనస్సు మొత్తాన్ని ఒత్తిడితో నింపుతుంది.
చాణక్య నీతి ప్రకారం ఉదయం లేవగానే చిందరవందరగా ఉన్న ఇంటిని చూడకూడదంట. దీని వలన సహజంగానే ఇది మీ మనసును చికాకులో పడేస్తుంది.
అదేవిధంగా ఉదయం లేచిన వెంటనే నిరాశ లేదా బద్ధకంతో ఉన్న వ్యక్తిని చూడకూడదంట. ఇది మీపై చాలా ప్రభావం చూపుతుందని చెబుతున్నాడు చాణక్యుడు.
అలాగే ఉదయం లేవగానే ఎప్పుడూ కూడా మీ అర చేతులను చూసుకొని, ఏదైనా దేవుడి ఫొటోలను చూడటం చాలా మంచిది.