చాణక్య నీతి : ఇలాంటి అమ్మాయి భార్యగా రావడం దురదృష్టం!
Samatha
24 November 2025
ఆ చార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఈయన తన జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ తరం వారికి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది.
ముఖ్యంగా చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వార నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాలను అందులో పొందుపరిచారు.
బంధాలు, బంధుత్వాలు, ముఖ్యంగా భార్య భర్తల బంధం గురించి చాలా విషయాలను ఆయన తెలిపారు. అలాగే, ఒక వ్యక్తి జీవితంలోకి ఎలాంటి మహిళ భార్యగా రాకూడదో కూడా వివరించారు.
భార్య భర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే, మూడుముళ్లతో ఇద్దరు వ్యక్తుల జీవితం నూరేళ్లు కొనసాగుతుంది. కానీ కొందరు తమ చిన్న తప్పుల వలన వివాహ జీవితాన్నే పాడు చేసుకుంటున్నారు.
చాణక్యుడి ప్రకారం ఏ భార్య అయితే భర్త కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయని భార్యతో జీవితం చాలా కష్టంగా ఉంటుందంట.
అలాగే ఇంట్లో భార్య ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, ఆమె ఇతరులతో వ్యవహరించే తీరు బాగలేకపోయినా ఆమెతో జీవించడం చాలా కష్టం.
అదే విధంగా భర్త దగ్గర డబ్బులు లేనప్పుడు , ఏ భార్య అయితే అతన్ని అవమానించి దూరం పెడుతుందో అలాంటి భార్యతో జీవితం నరకమేనంట.
అలాగే ఎప్పుడూ డబ్బు ఖర్చు చేయడం, అయినా ప్రతి దాంట్లో అసహనం వ్యక్తం చేసే భార్యతో జీవితం నరకంతో సమానం అంటున్నా చాణక్యుడు.