కొత్తిమీరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

21 November 2025

ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా కొత్తిమీర ఉంటుంది. ఇది వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అందుకే చాలా మంది తమ వంటల్లో తప్పకుండా కొత్తిమీరను ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.

కాగా, ఇప్పుడు మనం కొత్తిమీరను ప్రతి రోజూ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉండటం వలన ఇది కంటి చూపు మెరుగు పరచడానికి దోహదపడుతుంది.

అదే విధంగా కొత్తిమీర ఆకుల్లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.

ప్రతి రోజూ కొత్తిమీర మీ వంటల్లో చేర్చుకొని తినడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన మీ రోజూ వారి భోజనంలో ఇది చేర్చుకుంటే, ఇది రక్తంలోని చక్కె స్థాయిలను నియంత్రిస్తుంది.

కొత్తిమీర ఆకుల్లో కాల్షియం, భాస్వరం, మాంగనీస్ , మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.