చలికాలంలో.. చిన్న బెల్లం ముక్క చేసే మ్యాజిక్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!
Samatha
23 November 2025
బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
బెల్లం ఎలాంటి రసాయనాలు లేకుండా తయారు చేస్తారు. అందువలన దీనిని తినడం వలన ఎలాంటి వ్యాధులు దరి చేరవు అందుకే చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించాలని చెబుతున్నారు నిపుణులు.
అయితే బెల్లం ఏ సీజన్‌లో తిన్న దీని వలన అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో బెల్లం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
చలికాలంలో ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తినడం చాలా మంచిది, శరీరానికి ఇది చాలా అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. ఇది ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులను అడ్డుకుంటుందంట.
అదే విధంగా చలికాలంలో బెల్లం తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
అలాగే చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. వారు చిన్న బెల్లం ముక్క తినడం వలన జలుబు రాదంట.
అదే విధంగా బెల్లంలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సీజన్‌లో బెల్లం తినడం వలన ఇది రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుంది.
అదే విధంగా చలికాలంలో ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వలన ఇది, జీర్ణ సమస్యలను తగ్గించి, కడుపు ఉబ్బరం వంటి వాటి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట.