చాణక్య నీతి : ఈ సంకేతాలు కనిపిస్తే మీ జేబు ఖాళీ అవుతున్నట్లే!

Samatha

25 November 2025

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి సమాజానికి ఎన్నో విషయాలను తెలియజేశారు.

చాణక్యుడు సూచనలు పాటించి, వారు జీవితంలో ఎప్పుడూ ఇబ్బందుల్లో పడలేదు. చాలా వరకు సమస్యల నుంచి బయటపడిన వారే ఉంటారు.

చాణక్యుడు ఎన్నో విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే, అదే విధంగా ఆయన ఒక వ్యక్తి పేదరికాన్ని ఎదుర్కునే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో కూడా తెలియజేశాడు.

మీ ఇంటి లోపల  తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోయినట్లు అయితే, మీరు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారని అర్థం అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

అదే విధంగా ఉన్నట్లుండి అనారోగ్య సమస్యలు వస్తే, లేదా చేతిలో నుంచి ఉప్పు చేజారి కిందపడటం, అద్దం పగలడం కూడా మీకు వచ్చే ఆర్థిక సమస్యలను తెలియజేస్తుంది

ఇంటిలోపల నిరంతరం గొడవలు, వాదనలు, ఉద్రిక్తతలు ఉంటే అది చాలా అశుభ కరం అంటున్నాడు చాణక్యుడు. ఇది ఇంటి పురోగతిని అడ్డుకుంటుందంట.

అదే విధంగా ఏ ఇంటిలో అయితే స్త్రీలను గౌరవించరో, ఆ ఇంటిలో నిత్యం గొడవలు, దురదృష్టం నెలకుంటుంది అంటున్నాడు ఆ చార్య చాణక్యుడు.

ఏ ఇంటిలోనైతే పూజలు, ప్రార్థనలు జరగవో, ఆ ఇంటిలోపల సంపద ఎక్కువ కాలం ఉండదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.