వీళ్లు చిలగడదుంపలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. 

Jyothi Gadda

21 July 2025

కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చిలగడదుంపను అధికంగా తీసుకుంటే వారి ఆరోగ్యానికి మేలు చేయడం పక్కనపెడితే.. ఎక్కువ హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

చిలగడదుంప ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం పెరుగుతుంది. దీని కారణంగా హైపర్కలేమియా ఏర్పడి గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

చర్మ సంబంధిత అలర్జీలు, శ్వాసకోస ఇన్ఫెక్షన్లు ఉన్నవారు చిలగడదుంపల్ని ఎక్కువగా తినకూడదు. చిలగడదుంపల్లో మన్నిటాల్ ఉంటుంది. దినివల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు. 

అల్రెడీ అలర్జీ సమస్యలతో బాధపడేవారికి ఇది ముప్పుగా మారవచ్చు. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు చిలగడదుంప జోలికి పోకూడదంటున్నారు నిపుణులు.

చిలగడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా హానికరం. డయాబెటిస్‌తో బాధపడేవారు చిలగడదుంపల్ని ఎక్కువగా తినకపోవడమే ఉత్తమం. 

చిలగడదుంపల్లో అధిక మొత్తంలో విటమిన్ ఎ ఉంటుంది. చలికాలంలో చిలగడదుంపను ఎక్కువగా తింటే.. చర్మంపై దద్దుర్లు, తలనొప్పి సమస్యలు రావచ్చు అంటున్నారు నిపుణులు. 

అధిక బరువు సమస్యతో బాధపడేవారు చిలగడదుంపల్ని ఎక్కువగా తినకూడదు. చిలగడదుంపల్లో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు మరింత పెరిగే ప్రమాదముంది. 

కొందరు అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు చిలగడదుంపల్ని తినకపోవడమే ఉత్తమం. ఎందుకంటే