దొండకాయ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, ఒత్తిడి మొదలైన సమస్యలు తగ్గుతాయి. కానీ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. లో బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
తరచూ నీరసం, మూర్ఛ, తలనొప్పి, అలసట వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు, లో బీపీతో బాధపడేవారు దొండకాయను మితంగా తీసుకోవడమే మేలు అంటున్నారు నిపుణులు.
చర్మ, శ్వాస అలెర్జీ సమస్యలతో బాధపడుతున్న వారు దొండకాయ తినకపోవడమే మేలు. ఇలాంటి వారు పొరపాటున దొండకాయ తింటే వికారం లేదా వాంతులు అవుతాయి.
చర్మంపై దురద, మంట, వాపు వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే అలెర్జీ సమస్యలతో బాధపడేవారు దొండకాయకి దూరంగా ఉండాలి.
దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది శస్త్రచికిత్స సమయంలో సమస్యలను కలిగిస్తుంది. శస్త్రచికిత్సకు కొన్ని రోజుల ముందు దొండకాయ తినడం మానుకోండి.
గర్భధారణ సమయంలో దొండకాయలు తినడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పరిమిత పరిమాణంలో తింటే మేలు జరుగుతుంది. ఎక్కువగా తింటే మంచిది కాదంటున్నారు.
పాలిచ్చే తల్లులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కువగా దొండకాయలు తింటే పిల్లలకు జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉంటే దొండకాయను బేషుగ్గా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ఉన్నప్పుడు మాత్రం దొండకాయ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
దొండకాయ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో, పరిస్థితి మరింత దిగజారవచ్చు. దీంతో నీరసం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.