గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. రోజూ దీని రసం తాగితే.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
గోధుమ గడ్డిలో విటమిన్-ఎ, బీ కాంప్లెక్స్, సీ, ఈ, కే విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియెంట్స్, 17 అమైనో యాసిడ్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
గోధుమ గడ్డిలో ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయి.
గోధుమ గడ్డి జీర్ణక్రియను మెరుగుపరిస్తుంది. గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు పేగులను శుభ్రపరుస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.
గోధుమ గడ్డి జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. చక్కెర, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంచుతుంది.
ఎర్ర రక్తకణాలు, హీమోగ్లోబిన్, తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. ఇది అర్థరైటిస్ కారణంగా వచ్చే బోన్ స్టిఫ్‌నెస్, నొప్పి, వాపు వంటి లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది.