ఒక క‌ప్పు సోయాబీన్‌ను ఉడ‌క‌బెట్టి తింటే ఎన్నో సమస్యలకు పరిష్కారం..!!

Jyothi Gadda

23 July 2025

ఆరోగ్య‌వంత‌మైన ఆహారాల్లో సోయాబీన్ ది మొదటి స్థానం. వీటిల్లో మంచి పోషకాలు ఉంటాయి. సోయా బీన్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ప్రతీ రోజు సోయాబీన్స్ ను ఉడక బెట్టి కప్పు మోతాదులో తీసుకోవటం ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు, పిండి ప‌దార్థాలు, ఫైబ‌ర్ 6 గ్రాములు ల‌భిస్తాయి. పలు రకాల విటమిన్లు, ఐరన్ అందుతాయి.

అలాగే విట‌మిన్లు కె, బి9, బి1, బి2, బి3, బి5, బి6, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, ఫాస్ఫ‌ర‌స్‌, కాప‌ర్‌, మెగ్నిషియం, జింక్‌, పొటాషియం, సెలీనియం, క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. 

అందువ‌ల్ల పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్న‌వారు సోయాబీన్ ను రోజూ తింటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌ క్రియ‌లు స‌క్ర‌మంగా జరుగుతుంది. 

నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. నాన్‌వెజ్ తిన‌ని వారు ప్రోటీన్ల కోసం వీటిని తిన‌వ‌చ్చు. సోయాబీన్‌లో ఉండే ప్రోటీన్ల కార‌ణంగా చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 

హైబీపీ ఉన్న‌వారికి సోయాబీన్ ఎంత‌గానో మేలు చేస్తుంది. సోయాబీన్ గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు. 

పైగా ఇందులో ఉండే ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. వీటిని తింటే ఎముక ‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎముక‌ల సాంద్ర‌త పెరుగుతుంది. 

45 ఏళ్లు దాటిన మ‌హిళ ‌లు మెనోపాజ్ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంటారు. సోయాబీన్‌ను తింటే వారి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది.