రెండు వారాల పాటు షుగర్ తినడం మానేస్తే ఇన్ని లాభాలా..?
Jyothi Gadda
22 May 2025
కొద్ది రోజుల పాటు షుగర్ తినకుండా కొత్త ఛాలెంజ్ ని తీసుకుంటున్నారు కొంత మంది. ఇలా షుగర్ తినడం మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
షుగర్ తినకుండా కంట్రోల్ చేసుకోవడం కాస్త కష్టమైన పనే. కానీ..డయాబెటిస్ రాకుండా ఉండాలన్నా, బార్డర్ లో ఉన్నా తప్పనిసరిగా ఈ ఛాలెంజ్ తీసుకోవాలి.
రెండు వారాల పాటు షుగర్ పదార్థాలకు దూరంగా ఉంటే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. షుగర్ తినడం మానేసినప్పుడు ముందుగా మన ముఖంలోనే మార్పు కనిపిస్తుంది.
కాస్త కొవ్వు పెరిగిపోయి గుండ్రంగా మారిపోయిన ముఖం కాస్తా పర్ ఫెక్ట్ షేప్ లోకి వచ్చేస్తుంది. అంటే కోలగా తయారవుతుంది. అంతే కాదు. ముఖంపై ముడతలు ఉన్నా అవి తగ్గిపోతాయి.
శరీరంలో నీటి శాతం పెరిగినప్పుడు ముఖంపైనా మార్పు కనిపిస్తుంది. చర్మం బాగా వదులుగా మారిపోతుంది. కళ్ల చుట్టూ ఉన్న చర్మం ముడతలు పడిపోయి వేలాడినట్టుగా అయిపోతుంది.
తద్వారా చిన్న వయసులోనే ముసలి వాళ్లలా కనిపిస్తారు. షుగర్ తినడం మానేస్తే వదులుగా ఉన్న చర్మం స్టిఫ్ గా మారి ముడతలు తగ్గిపోతాయి. నల్లటి వలయాలూ పోతాయి.
రెండు వారాల పాటు షుగర్ తినడం మానేస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఫ్యాటీ లివర్ సమస్య కూడా తీరిపోతుంది.
మొటిమలే కాదు. ముఖంపై ఉండే రెడ్ స్పాట్స్ కూడా తగ్గిపోతాయి. జిడ్డుగా ఉండే స్కిన్ శుభ్రంగా మారుతుంది. క్రమంగా మొటిమలు తగ్గిపోయి ఫేస్ క్లీన్ గా మారిపోతుంది.